జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా వినతులు పరిష్కార కార్యక్రమం
1 min readముఖ్యమంత్రికి, ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తాం
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
జిల్లా కలెక్టర్ వేట్రీ సెల్వీ కి పలు ప్రజా సమస్యలపై పరిష్కారం కోరుతూ వినతి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పలు ప్రజా సమస్యలపై పరిష్కారం కోరుతూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు, రజకులకు ప్రభుత్వం అండగా ఉండాలనే సంకల్పంతో గత టిడిపి ప్రభుత్వ హయంలో ఆదరణ పథకం ద్వారా లబ్ధిదారుని వాటా కింద కేవలం 10% కట్టించుకుని, వారికి కొన్ని లక్షల రూపాయల పరికరాలను అందించాలని వాటిని ప్రభుత్వం తరఫున సిద్దం చేసి, దెందులూరు మార్కెట్ యార్డ్ నందు ఉంచడం జరిగిందని అన్నారు. దురదృష్టవశాత్తు ఆనాడు టిడిపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకపోవడంతో లబ్ధిదారునికి పరికరాలు అందలేదని, గత వైసిపి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు, దళారులు వాటిని దుర్వినియోగం చేశారని, అసలు అన్ని లక్షల రూపాయల సామాగ్రి ఏమయ్యింది అనేది లబ్ధిదారులకు ఎవరు సమాధానం చెప్పడం లేదని, లబ్దిదారులకు అందాల్సిన పరికరాలను దొంగిలించుకు పోయినా వారిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ కి వినతి పత్రం అందజేశామని అన్నారు. అదేవిధంగా ఏలూరు జిల్లాకు సరియైన ఇసుక క్వారీలు లేవని, కుక్కునూరు వేలేరుపాడు నుండి తీసుకురావడానికి దూరమవుతుందని రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా తాల్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి గోదావరి ఒడ్డున ఇసుక క్వారీ కేటాయిస్తే ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాలకి ఇసుక పుష్కలంగా లభిస్తుందని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, అదేవిధంగా ఏలూరు జిల్లా ఇన్చార్జి మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లామని మన జిల్లా కలెక్టర్ కి కూడా వినతి పత్రం అందజేశామని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.