చిన్న వ్యాపారులకు సాధికారిత కల్పిస్తున్న ఫెడెక్స్
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ అయిన ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కార్పొరేషన్, యునైటెడ్ వే ముంబై, సాక్షం ద్వారా సమ్మిళిత వ్యాపార సామర్థ్యానికి మద్దతు ఇవ్వడం ద్వారా తన కార్పొరేట్ పౌరుడి పాత్రను సమర్థవంతం నిర్వహించింది. స్థానిక మానవతా భాగస్వామి సహకారంతో, ఫెడెక్స్, భారతదేశంలోని విభిన్న క్రియాశీలక ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక స్వాతంత్య్రాన్ని పెంపొందించడానికి తగిన వనరులును, శిక్షణ మరియు మార్గదర్శకాలను మైనారిటీ వ్యాపారులకు అందిస్తోంది. ఈ సాక్షం అనేది, స్థానిక మార్కెట్ డిమాండ్‌లకు అనుగుణంగా రూపొందించబడిన టైలరింగ్, ఫుడ్ సర్వీసెస్ మరియు బ్యూటీ సర్వీసెస్‌తో సహా వివిధ రంగాల్లోని చిన్న వ్యాపారులకు, 2021 నుండి అనుకూలమైన వ్యాపార కిట్‌లను అందిస్తోంది. ఈ కిట్‌లు లబ్ధిదారులకు స్థిరమైన వ్యాపారాలను నిర్మించడానికి వీలు కల్పిస్తాయి మరియు యు.డబ్ల్యు.ఎం. పోస్ట్-డిస్ట్రిబ్యూషన్ అంచనా ప్రకారం, కేవలం ఒక్క మే 2024 నెలలోని పంపిణీ మాత్రమే అద్భుతమైన ఫలితాలను అందించింది.గతంలో ఎలాంటి ఆదాయ వనరులు లేని 38% మందికి— ఇప్పుడు సగటు వార్షిక ఆదాయం ₹61,176. సంవత్సరానికి ఆదాయం ₹15,000లోపు ఉన్నవారిలో 19% మందికి—ఇప్పుడు పెరిగిన సగటు ఆదాయం ₹66,782.ఈ సాక్షం అనేది, ఎల్.జి.బి.టి.క్యు.ఐ.ఎ.+ కమ్యూనిటీ కోసం ఎన్.జి.ఓ.ల పంపిణీ అనంతర అంచనా ప్రకారం పరివర్తన ఫలితాలను కూడా అందించింది.ప్రారంభంలో, ఎల్.జి.బి.టి.క్యు.ఐ.ఎ.+ పాల్గొనేవారిలో 45% మంది నిరుద్యోగులు. సాక్షంలో నమోదు చేసుకున్న తర్వాత, వారిలో 90% మంది ఉపాధి లేదా స్వయం ఉపాధి పొందారు.68% మంది ఇప్పుడు ప్రైవేట్ రంగంలో నెలకు ₹14,000-₹15,000 మధ్య సంపాదిస్తూ ఉపాధి పొందుతున్నారు, అయితే 23% మంది సాంస్కృతిక ప్రదర్శనలు, సౌందర్య సేవలు మరియు టైలరింగ్‌లో విజయవంతమైన స్వయం ఉపాధి వెంచర్‌లను కూడా స్థాపించారు.”చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (ఎస్.ఎం.ఇ.లు) ఆర్థిక వృద్ధికి ఒక చోదక శక్తిగా ఉన్నాయి, అయినప్పటికీ చాలా మంది పారిశ్రామికవేత్తలకు విజయవంతం కావడానికి తగిన వనరులు లేవు” అని ఫెడెక్స్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సువేందు చౌదరి వ్యాఖ్యానించారు. “సాక్షం అనేది, మహిళలు మరియు ఎల్.జి.బి.టి.క్యు.ఐ.ఎ.+ వ్యాపారుల మధ్య గల వ్యాపార అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, వారికి అవసరమైన వనరులను మరియు స్వయం సమృద్ధికి స్పష్టమైన మార్గాలను అందిస్తుంది. భారతదేశంలోని ఎస్.ఎం.ఇ. ఎకో సిస్టమ్ లో వారు అభివృద్ధి చెందడానికి మరియు సమగ్రమైన, దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధి కోసం భారతదేశ లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము.2021లో ప్రారంభించినప్పటి నుండి, సాక్షం అనేది, భారతదేశంలో ఫెడెక్స్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సి.ఎస్.ఆర్. స్తంభానికి మూలస్తంభంగా ఉంది, స్థిరమైన జీవనోపాధిని నిర్మించడానికి సాధనాలతో తక్కువ సేవలందించే సమూహాలను శక్తివంతం చేస్తుంది. సాక్షం ద్వారా, ఫెడెక్స్ ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుంది.