సర్వేశ్వర్ ఫుడ్స్ సింగపూర్ యూనిట్‌కు 12,000 మెట్రిక్ టన్నుల రైస్ ఆర్డర్
1 min readవార్షిక ఆదాయంగా రూ. 2000 మిలియన్ లక్ష్యం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్ (బిఎస్ఈ: 543688, ఎన్ఎస్ఈ: సర్వేశ్వర్), ఐఎస్ఓ 22000:2018 మరియు యూఎస్ఎఫ్డీఏ సర్టిఫైడ్ ఎఫ్ఎంసిజి రంగంలో ప్రముఖ సంస్థ, తన పూర్తిగా యాజమాన్యంలో ఉన్న సింగపూర్ ఆధారిత గ్రీన్ పాయింట్ . లిమిటెడ్ 12,000 మెట్రిక్ టన్నుల ప్రీమియం ఇండియన్ లాంగ్ గ్రేన్ పార్బాయిల్డ్ రైస్ సరఫరాకు రూ. 445 మిలియన్ల విలువైన ఆర్డర్ పొందినట్లు ప్రకటించింది.ఈ ఆర్డర్ సింగపూర్ అనుబంధ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2000 మిలియన్ వ్యాపార లక్ష్యాన్ని చేరుకోవడానికి చేపట్టిన వ్యూహాత్మక డ్రైవ్‌లో కీలకమైనది. సర్వేశ్వర్ ఫుడ్స్ రైస్ మరియు రైస్ ఆధారిత ఉత్పత్తుల గ్లోబల్ మార్కెట్లో స్థిరంగా వృద్ధి చెందుతున్న స్థాయిని ఈ ఆర్డర్ బలపరుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా గ్లూటెన్ ఫ్రీ ఉత్పత్తులకున్న పెరుగుతున్న డిమాండ్, సీలియాక్ వ్యాధి, గ్లూటెన్ అసహనంతో బాధపడే రోగుల సంఖ్య పెరగడం వంటి అంశాలు ఈ రంగంలో గణనీయమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. గ్రీన్ పాయింట్ పిటిఈ. లిమిటెడ్ ఈ వేగంగా విస్తరిస్తున్న రంగంలో అధిక మార్కెట్ షేర్ సంపాదించడానికి అనుకూలమైన స్థాయిలో ఉంది”ఈ పెద్ద ఆర్డర్ మా గ్లోబల్ వ్యాపారానికి ఉత్సాహం నింపుతుంది. గ్లూటెన్ ఫ్రీ డైట్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతతో, మా లక్ష్యం సింగపూర్ అనుబంధ సంస్థ ద్వారా రూ. 2000 మిలియన్ టార్గెట్ చేరుకోవడమే,” అని సర్వేశ్వర్ గ్రూప్ చైర్మన్ మిస్టర్ రోహిత్ గుప్తా తెలిపారు.నింబార్క్ బ్రాండ్ కింద సర్వేశ్వర్ ఫుడ్స్ ప్రతిష్టాత్మకమైన ఆర్గానిక్ ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్లో ప్రాచుర్యం పొందాయి. ఇటీవల కంపెనీ హెచ్1 ఎఫ్ వై 25లో రూ. 500 కోట్ల మార్క్ దాటడం ద్వారా గొప్ప మైలురాయి సాధించింది.మధ్యప్రాచ్యం మార్కెట్లో వ్యాపార సమన్వయాన్ని మెరుగుపరచేందుకు దుబాయ్‌లోని నేచురల్ గ్లోబల్ ఫుడ్స్ డిఎంసిసి సంస్థను పూర్తిగా పొందే ప్రక్రియ చేపట్టడం మరో కీలక దశగా ఉంది.సర్వేశ్వర్ ఫుడ్స్ తన 130 సంవత్సరాల వారసత్వంతో పాటు హిమాలయ పాదాల్లోని సహజ వనరులతో ‘సాత్విక్’ జీవన విధానాన్ని ప్రోత్సహిస్తూ తన ఆర్గానిక్ ఉత్పత్తులను ‘నింబార్క్’ బ్రాండ్ కింద అందిస్తోంది.