మెప్మా బజారును పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో పొదుపు సంఘాల ( మెప్మా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మా బజారును ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డి గారు పరిశీలించారు. పొదుపు సంఘాల మహిళలు చేసిన వస్తువులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పొదుపు సంఘాల సృష్టికర్త సీఎం నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు పెంచి వేసులుబాటు కల్పించారన్నారు. త్వరలోనే ఎమ్మిగనూరులో మెప్మా బజార్ తో పాటు మెప్మా సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేపడుతామని తెలిపారు. పొదుపు సంఘం మహిళలు చేస్తున్న వస్తువులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామన్నారు. మహిళలు చేతు ద్వారా చేసే వస్తువులను మెప్మా బజార్లో అందుబాటులోకి తెచ్చారని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మెప్మా సిబ్బంది జయవర్ధన్, పొదుపు సంఘాల మహిళలు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.