ఏరీస్ 56 వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఏరీస్ 56 వ వ్యవస్థాపక దినోత్సవo సందర్భంగా వేడుకలు కర్నూలు జిల్లా, హొళగుంద గ్రామం- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి.ఈ వేడుకలల్లో భాగంగా ఏరీస్ బృందం వారు విద్యార్థులకు ఏరీస్ కంప్లెనీ యొక్క ఉత్పాదనలు మరియు వాటి యొక్క విశిష్టతను విద్యార్తులకు అవగాహన కల్పించిపంటలో వచ్చే సమస్యలను మరియు సమగ్ర పోషక యాజమాన్యం యొక్క విశిష్టతను, మట్టి పరీక్ష పరికరం ఉపయోగాలను విశిష్టతను వేడుకలకు హాజరాయిన విద్యార్థులకు తెలియజేశారు. తదనంతరం పదవ తరగతి చదువుతున్న 250 విద్యార్థులకు లంచ్ బాక్సులు అందజేశారు. ఏరీస్ ప్రతినిధులు శ్రీ జయప్రదీప్ సుబ్రహ్మణ్యం మరియు శ్రీ సురేష్ ప్రసంగిస్తూ ఏరీస్ నాణ్యతకు చాలా ఎక్కువ ప్రాదాన్యత ఇస్తుందని, రైతులకు మునిపటి వలె మునుముందు కూడా సహాయసహకారాలను అందిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏరీస్ కంపెనీ శ్రీ జయ ప్రదీప్ సుబ్రమణియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సౌత్, శ్రీ సురేష్ రీజినల్ మేనేజర్ రాయలసీమ, హెడ్ మాస్టర్ నజీర్ అహ్మద్ ,శ్రీ గణేష్ , SO ఆదోని, N హస్వంత్ రెడ్డి ఎక్సటెన్షన్ ఆఫీసర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.