బాల్య వివాహాలను అరికట్టాలి -ప్రిన్సిపాల్ నయమన్నీసా బి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత అందరూ తీసుకోవాలని ప్రిన్సిపాల్ నయమున్నీసా బి అన్నారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాల్యవివాహాలపై విద్యార్థినిలకు మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నయమన్నేసాబి, ప్యానల్ న్యాయవాదులు నాగేష్, సురాజ్ నబి మాట్లాడుతూ, బాల్య వివాహాలు చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బాల్యవివాహాలు ఎక్కువ జరుగుతున్నాయని, బాల్య వివాహాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ 15100 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ నెంబర్ కి ఫోన్ చేసి బాల్య వివాహాలను నివారించవచ్చని వివరించారు. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుదామని అన్నారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్యార్థినుల చేత న్యాయవాదులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నాగరాజు, లోక్ అదాలత్ క్లర్క్ రాఘవేంద్ర, కళాశాల అధ్యాపకులు రామ్మోహన్, అమీనాభి, సమీనా, శోభారాణి, శాంతమ్మ, విద్యార్థినులు పాల్గొన్నారు.