చెడు వ్యసనాలకు క్రీడాకారులు దూరంగా ఉండాలి
1 min readక్రీడల్లో మంచి ప్రతిభ కనబరచాలి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: క్రీడాకారులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో మంచిది ప్రతిభ కనబరచాలని టిడీపీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు అన్నారు. యస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్ 19 బాల బాలికల ఫెన్సింగ్ క్రీడలు రెండవ రోజు నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియం నందు నంద్యాల జిల్లా అండర్ 14/ 17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహక కార్యదర్శి శ్రీనాథ్ ఆధ్వర్యంలో జరిగాయి.ఈ కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి మరియు ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు,జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజు, అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కర్నూలు కార్యదర్శి హర్షవర్ధన్,ఫెన్సింగ్ స్టేట్ అబ్జర్వర్ భవానీ,అడ్వకేట్ వెంకటరమణ,స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ గెలుపోటములు సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వంలో క్రీడా రిజర్వేషన్ లు 2 నుండి 3 శాతం పెంచడం హర్షణీయమన్నారు.తర్వాత సాయంత్రం బాలుర షాబర్,ఫాయిల్ టీం ఈవెంట్లలో విజేతలకు మెడల్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ.రెడ్డి,ఎస్టియు శ్రీనివాసరావు,స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు నాగేంద్ర,డి నాగరాజు, రవికుమార్,విశ్వనాథ్,మహేష్,లక్ష్మణ్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు క్రిష్ణయ్య, రాంబాబు,సోలమోన్, సుంకన్న,రాజశేఖర్,భరత్ రెడ్డి,సురేష్ నాయుడు, ఓబులేసు,రాజేష్,దాసు, చంద్రావతమ్మ,కవిత,రేణుక, శశికళ,భారతి,రాణెమ్మ తదితరులు పాల్గొన్నారు.