NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా విశ్వకర్మ జయంతి

1 min read

ఎమ్మిగనూరు  న్యూస్ నేడు :  ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని రహదారిలో ఉన్న శ్రీ కాళికాదేవి స్థలం కార్యాలయంలో బుధువారం శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెసలదిన్నె పురోహితులు మహేష్ శర్మచే ప్రత్యేక పూజలతో పాటు హోమం నిర్వహించారు.  అనంతరం  జిల్లా అధ్యక్షులు నడిపి బ్రహ్మయ్య ఆచారి, గౌరవ అధ్యక్షులు గువ్వలదొడ్డి శ్రీనివాసులు , వీరభద్రాచరి, ఆధ్వర్యంలో శ్రీ విశ్వబ్రహ్మణ సేవాసంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డాక్టర్ జాలవాడి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా దైవందిన్నె సూర్యనారాయణ ఆచారి, ప్రధాన కార్యదర్శులుగా సురేష్ ఆచారి, లక్ష్మి నారాయణ ఆచారి, రమేష్ ఆచారి, కోశాధికారులుగా గోరంట్ల ఆచారి, ఉరుకుందు ఆచారి, నాగరాజు ఆచారి, కార్యదర్శులుగా రంగస్వామి, ఈశ్వర్ ఆచారి, నరసింహ ఆచారి, హరి ఆచారి, లోకేష్ ఆచారి, మోహన్ ఆచారి, శంకర్ ఆచారిలను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు జాలవాడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ విశ్వానికి శ్రమజీవులుగా ఉన్న కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పాకారులు, స్వర్ణకారులకు సామాజిక సేవ చేస్తూ.. అందరి విశ్వాసంతో, భక్తితో, బుద్ధిబలముతో నిరుపేదలకు వైద్య సేవ చేస్తూ, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటానని, అర్హులైన అందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేసేలా కృషి చేస్తానన్నారు. అలాగే శ్రీ కాళికాదేవి ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అంతకముందు అధ్యక్షులగా ఎన్నికైన జాలవాడి శ్రీనివాసులను చిన్నారుల కళాశాలతో పూర్ణకుంభంతో ఇంటి నుండి సభాస్థలం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. పలువురు పూలమాలలు, శాలువలతో జాలవాడి శ్రీనివాసులును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు రవి కుమార్ ఆచారి, రామాచారి, రఘువీరాచారి తదితరులు పాల్గొన్నారు.

About Author