మంత్రి టి.జి భరత్‌ను సన్మానించిన టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ లో హైకోర్టు బెంచ్ విషయంలో గత 20 సంవత్సరాలుగా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారా తన తండ్రి టి.జి వెంకటేష్ చేసిన పోరాటాన్ని ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వాన్ని ఒప్పించి కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకునేలా నిజం చేసిన ఘనత రాష్ట్ర మంత్రి టి.జి భరత్‌కు దక్కుతుందని టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టి.జి భరత్ కార్యాలయంలో టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాస భట్, నాగముని, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఉపాధ్యక్షుడు గణేష్ సింగ్ తోపాటు మహిళా న్యాయవాదులు మాధవి, నాగ విజయ, సుమన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కర్నూల్ లో హైకోర్టు బెంచ్ కోసం రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారా రాజ్యసభ మాజీ సభ్యులు టి.జి వెంకటేష్ పోరాటం చేశారని వివరించారు. అయితే గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం రాష్ట్ర మంత్రి హోదాలో ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా రాష్ట్ర మంత్రి టి.జి భరత్ కృషి చేశారని చెప్పారు. కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంలో కృషిచేసిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్ ను కలిసి ధన్యవాదాలు తెలిపామని వారు వివరించారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు టి.జి వెంకటేష్ పోరాటం, రాష్ట్ర మంత్రిగా టి.జి భరత్ చేసిన కృషి వల్ల ఎన్నో సంవత్సరాలుగా తాము ఎదురుచూస్తున్న హైకోర్టు బెంచ్ కర్నూల్ లో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రాంత న్యాయవాదుల కల నెరవేరిందని చెప్పారు.