పంటల బీమాకు రైతులు దరఖాస్తు చేసుకోవాలి
1 min readవ్యవసాయ అధికారి కే శ్రీదేవి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని రైతులందరూ పంటల బీమాకు దరఖాస్తు చేసుకోవాలని గురువారం మండల వ్యవసాయ అధికారి కే. శ్రీదేవి ఒక ప్రకటనలో తెలియజేశారు. బ్యాంకులలో రుణాలు పొందిన రైతులు ,రుణాలు రెన్యువల్ ద్వారా పంటల బీమా ప్రీమియం చెల్లించవచ్చు అన్నారు. అంతేకాక రైతులు భూమి పాసుబుక్, ఆధార్ కార్డు ,బ్యాంక్ అకౌంట్,వీఎస్ఏ వారిచే జారీ చేయబడిన క్రాప్ షోన్ సర్టిఫికెట్, కౌలుదారులైతే సిసిఆర్సి కార్డుతో పంటల బీమా కొరకు ప్రీమియం చెల్లించవలసి ఉంటుందన్నారు. వీటన్నింటి ద్వారా రైతులు నేరుగా సిఎస్సి కామన్ సెంటర్ ద్వారా కానీ ,ఎన్సిఐపి (నేషనల్ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ పోర్టల్) నందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు .ఏ ఏ పంటలకు ఎంత ప్రీమియం చెల్లించాలని తెలుసుకోవాల్సిన రైతులు రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. రబీ పంట 2024 కై మండలంలోని శివాలు పల్లెలో క్రాప్ బుకింగ్ చేయడం జరిగిందన్నారు.