మాతృ మరణాలు జరగకూడదు….
1 min readగర్భిణీ స్త్రీలకు 8,9 నెలల్లో ప్రతి వారం పరీక్షలు నిర్వహించి వారు ఆరోగ్యంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
తల్లులను కోల్పోయిన పిల్లలకు రూ. 50 వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే విధంగా చర్యలు చేపడతాం
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మాతృ మరణాలు జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మెడికల్ ఆఫీసర్ లను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు జరిగిన మాతృ మరణాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఆయా పిహెచ్చిల్లో మాతృ మరణాలు ఎలా జరిగాయి అని సంబంధిత వైద్యాధికారులు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై మాతృ మరణాలను నివారించుకోవడానికి ఇంతవరకు జరిగిన మరణాల కేస్ లను స్టడీ చేసి, వాటి ఆధారంగా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఒక ఎస్ఓపి తయారు చేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.. ఈ ఎస్ఓపి పై క్రింది స్థాయి సిబ్బందికి కూడా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.పిహెచ్సి లు, సీ హెచ్సీ లలో గర్భిణీ స్త్రీలకు సంబంధించిన క్రిటికల్ కేసుల్లో తప్పనిసరిగా రాత్రి ఏ సమయమైనా మెడికల్ ఆఫీసర్ లు వాటిలో ఉండి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.గర్భిణీ స్త్రీలకు 8,9 నెలల్లో ప్రతి వారం పరీక్షలు నిర్వహించి వారు ఆరోగ్యంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హై బిపి తో మరణాలు సంభవించడం ఒక కారణం అయినందువల్ల, 8,9 నెలలలో ప్రతి వారం పరీక్షలు నిర్వహించి, మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు..ఒక వేళ వారి ఆరోగ్యానికి సంబంధించి అసాధారణ పరిస్థితులు ఉంటే వారి దగ్గరికి వెళ్లి చికిత్స ఇచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో మాతృ మరణాల వల్ల జూన్ నుండి సెప్టెంబరు వరకు 9 తల్లులను కోల్పోయిన పిల్లల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వారి పేరు మీద 50 వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే విధంగా చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.ఆదోని ఎంసిహెచ్ లో ఆపరేషన్ థియేటర్ చాలా చిన్నగా ఉందని, రెనోవేట్ చేసేందుకు ఒక డిఓ లేఖను సిద్ధం చేయాలని కలెక్టర్ డిసిహెచ్ఎస్ ను ఆదేశించారు.ఒక మాతృ మరణానికి సంబంధించి చికిత్స చేసిన కర్నూలు నగరం లోని మనం హాస్పిటల్ డాక్టర్లు సమావేశానికి హాజరు కాకపోవడంతో కలెక్టర్ వారికి నోటీసు జారీ చేయాలని కలెక్టర్ డి ఏం హెచ్ ఓ ను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఎం హెచ్ఓ డా.భాస్కర్, డిసిహెచ్ఎస్ డా.మాధవి, వైద్య సిబ్బంది, ఎంఎల్హెచ్పి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.