అపార్ తక్కువ శాతం నమోదు కావటానికి గల కారణాలు గూర్చి ఆరా
1 min readఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
పల్లెవెలుగు వెబ్ ఆదోని: డివిజన్ లో ఆటోమేటిక్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రే (అపార్) వంద శాతం పూర్తి కావాలని ఆదోని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో అపార్ తక్కువ శాతం నమోదైన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల మరియు జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ…అపార్ తక్కువ శాతం నమోదు కావటానికి గల కారణాలు గూర్చి ఆరా తీశారు… ఎక్కువగా రిజెక్షన్ ఉన్నాయన్నారు. రిజెక్షన్ లో పేరు, వయసు, జెండర్ తప్పులును ఉన్న వాటిని ఉపాధ్యాయులు మరియు గ్రామంలో ఉండే పంచాయతీ కార్యదర్శి నివృత్తి చేసుకొని సరి చేయాలన్నారు. ఆధార్ అప్డేషన్ సంబంధించి ముందుగా స్కూల్ ను మ్యాపింగ్ చేసుకొని, ఆధార్ అప్డేషన్ చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి అపార్ నమోదు చేయటానికి ప్రత్యేక చర్యలు తీసుకోని వంద శాతం అపార్ నమోదు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు.ఆదోని మండల విద్యాధికారి రాజేంద్ర ప్రసాద్ -1 శ్రీనివాసులు-2 ఎమ్మిగనూరు మండల విద్యాధికారి ఆంజనేయులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.