ఆర్భాటంగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాలు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తల్లిదండ్రుల సమావేశాలు నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో మండల పరిషత్ ప్రాథమిక మరియు జిల్లా పరిషత్,కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో మరియు మోడల్ పాఠశాలలో శనివారం జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ సలీం భాష ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, ఎంపీడీవో దశరథ రామయ్య, తహసిల్దార్ శ్రీనివాసులు,ఎస్ఐ ఓబులేష్, గ్రామ సర్పంచ్ జయ లక్ష్మమ్మ హాజరయ్యారు.అదే విధంగా కేజీబీవీలో పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బాలికలు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.మండలంలోని వివిధ పాఠశాలల్లో తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు.గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.