పూర్వపు విద్యార్థి ముఖ్య అతిథిగా వచ్చిన వేళ..
1 min readజూపాడుబంగ్లా..లక్ష్మాపురం గురుకులాల్లో ఘనంగా ఆత్మీయ సమావేశం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అదే పాఠశాలలో చదివిన విద్యార్థి నిన్న జరిగిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చారు డాక్టర్ గంగాధర్..నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో శనివారం తల్లి తండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గతంలో ఇదే పాఠశాలలో చదివానని ఇదే పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నాకు ఆనందంగా ఉందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎర్రన్న మాట్లాడుతూ 1986 లో గురుకులం సొసైటీని స్థాపించారని చదువుకుంటేనే జ్ఞానం అనేది వస్తుందని అన్నారు.వైస్ ప్రిన్సిపాల్ దామోదర్ రెడ్డి మరియు పాఠశాల చైర్మన్ జయన్న మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసమే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని చదువుకుంటేనే జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉంటేనే సంపద వస్తుందని చెడు వ్యర్థాలకు విద్యార్థులు బానిస కాకుండా వారిని క్రమశిక్షణతో పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు.అనంతరం తల్లిదండ్రులకు నిర్వహించిన పోటీల్లో బహుమతులను అందజేశారు.లక్ష్మాపురం గురుకుల బాలికల పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ వి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పగిడ్యాల జడ్పిటిసి పుల్యాల దివ్య హాజరయ్యారు.మంచిగా చదువుకొని విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండే విధంగా ఒక లక్ష్యంతో మీరు చదవాలని ఎంతమంది విద్యార్థులు ఇక్కడ చదివిన వారు వివిధ స్థాయిలో ఉద్యోగ స్థానంలో ఉన్నారని పుల్యాల దివ్య మరియు ప్రిన్సిపాల్ అన్నారు.ఆటలు పోటీల అనంతరం బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా పాఠశాల వైస్ చైర్మన్ జయంతి, ఉపాధ్యాయులు మునయ్య, సోమశేఖర్,ప్రసాద్,కృష్ణుడు, సుబ్బారెడ్డి,నాగరాజ్, సుంకన్న..లక్ష్మాపురం వైస్ ప్రిన్సిపాల్ కృష్ణకుమారి, హైమావతి,లక్ష్మీదేవి,స్రవంతి,తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు.