మెడిటేషన్ వల్ల కలిగే లాభాలపై అవగాహన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు గౌరవనీయులైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి.లీల వెంకట శేషాద్రి కర్నూలు బార్ అసోసియేషన్ నందు “Sensitization Programme on Mediation” నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మరియు రిసోర్స్ పర్సన్ గా 6 వ అదనపు జిల్లా జడ్జి పి. పాండు రంగా రెడ్డి హాజరయ్యారు.అదనపు జిల్లా జడ్జి మాట్లాడుతూ Mediation వల్ల కలిగే లాభాలు మరియు mediation ను ఉపయోగించి కేసులు ఎలా త్వరిత గతిన పరిష్కరించాలో న్యాయవాదులకు వివరించారు. న్యాయవాదులు తమ కక్షిదారులను మధ్యవర్తిత్వం దిశగా ఒప్పించేందుకు కృషి చేయాలన్నారు. కోర్టులో పెండింగ్ ఉన్న వీలైనన్ని ఎక్కువ కేసులు mediation దిశగా పరిష్కరించుకునేలా కృషి చెయ్యాలని కోరారు. Mediation rules and regulations మరియు Act గురించి న్యాయవాదులకు వివరించారు. ఈ సదస్సులో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.కృష్ణ మూర్తి, బార్ సెక్రటరీ రవికాంత్ ప్రసాద్, బార్ మెంబెర్స్ మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.