రోళ్లపాడులో యువతి అదృశ్యం..కేసు నమోదు
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడు గ్రామానికి చెందిన రెడ్డిపోగు సంధ్యారాణి (17)యువతి అదృష్టమైనట్లు ఎస్ఐ హెచ్ ఓబులేష్ అన్నారు.ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు రోళ్లపాడు గ్రామానికి చెందిన రెడ్డిపోగు పెద్ద వెంకటరమణ,చిట్టెమ్మ కూతురు సంధ్యారాణి ఈనెల 5వ తేదీ ఉదయం 5 గంటల నుండి కనిపించడం లేదని వారి బంధువుల దగ్గర వెతికినా కనిపించ లేదని అదే గ్రామానికి చెందిన గుండెపోగు ఏసన్న కుమారుడు సీతారాముడుపై అనుమానం వుందని తల్లి చిట్టెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సీతారాముడుకు గతంలోని వివాహం అయింది ఒక కుమారుడు ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు.