PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి మానవుడికి మార్గదర్శి భగవద్గీత…

1 min read

ఆంధ్ర ప్రదేశ్  సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా కో- ఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి

ముగిసిన భగవద్గీత శ్లోక కంఠస్థ పఠన పోటీలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రతి మానవుడికి భగవద్గీత మార్గదర్శి అని, ప్రతి మానవుని జీవితంలో ఎదురయ్యే వడిదుడుకులను ఎలా అధిగమించాలో భగవద్గీత తెలుపుతుందని పరిపూర్ణ జీవితానికి భగవద్గీత ఎంతగానో తోడ్పడుతుందని ఆంధ్ర ప్రదేశ్  సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా కో- ఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని టి.జి.వి.కళాక్షేత్రం నందు భగవద్గీత శ్లోక కంఠస్థ పఠన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించి, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. లలిత కళా సమితి – టి.జి.వి.కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతు బాల్యంలోనే  ఇటువంటి విద్యను నేర్చుకోవడం వలన విద్యార్థులలో ధారణా శక్తి పెరుగుతుందని అన్నారు.

పోటీలలో విజేతలు వీరే

6-7 తరగతులలో  ప్రథమ జె.కృష్ణ, ద్వితీయ పవన్ కుమార్, తృతీయ పి. వీక్షశ్రీ, 8-9-తరతులకు గాను ప్రధమ భువన శ్రీ, ద్వితీయ శ్రీనిధి, తృతీయ శ్రీ నిత్య, 18 సంవత్సరాల పైబడిన వారిలో ప్రథమ యం.సంగీత, ద్వితీయ బి.అపర్ణ, తృతీయ జి.శివన్న, 18 సంవత్సరాల లోపు వారిలో ప్రథమ బి. నాగ శర్వాణి, ద్వితీయ సి.తరుని విజేతలుగా నిలిచారు. వీరికి ప్రధమ 1000-00, ద్వితీయ 750-00, తృతీయ 500-00 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు. హాజరైన విద్యార్థులందరికీ శ్రీమద్రామాయణ సంగ్రహం పుస్తకాలను ప్రోత్సాహక బహుమతులుగా అందించారు.  భగవద్గీత పోటీలకు హాజరైన వారందరికీ తరిగొండ వెంగమాంబ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పసుపులేటి నీలిమ ఆధ్వర్యంలో మహాప్రసాదం అందించారు. ఈ పోటీలకు న్యాయం నేతలుగా హెచ్ సీతామహాలక్ష్మి, డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని, జోషి సువర్ణ, అనంత అనిల్, డాక్టర్ ఎస్ .దేవి దయానంద సింగ్, జి. భానోజీ రావు, ఎల్.శిరీష, సి. శ్రీకాంత్ బాబు, పసుపులేటి నీలిమ సేవలందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, అధ్యాపకులు వరలక్ష్మి, గరుడాద్రి వనజకుమారి, ఎ.శివ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *