శ్రీ సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా విశేష పూజలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో నిన్న శ్రీ సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా, శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషమైన పూజలు, అభిషేకాలు, కావడి సేవలు, విశేషంగా జరిగాయి. సాయంత్రం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.