NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి

1 min read

డీఎం హెచ్ ఓ డా. శాంతి కళ

కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హార్ట్ వాక్ -2025

కర్నూలు, న్యూస్​ నేడు  : ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టి మంచి అలవాట్లతో నడుచుకోవాలని సూచించారు కర్నూలు జిల్లా: డి.ఎం.హెచ్.ఓ. డా. శాంతి కళ.  అంతర్జాతీయ హృదయ దినోత్సవం పురస్కరించుకొని కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హార్ట్ వాక్ ను  జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. అక్కడ ప్రారంభమైన వాక్ కిసాన్ ఘాట్ కమాన్ వరకు సాగింది. అనంతరం కిసాన్ ఘాట్ వద్ద ఉచిత కార్డియాక్ క్యాంపు ను ప్రారంభించారు.  ఈ సందర్భంగా  డీఎం హెచ్ ఓ డా. శాంతి కళ మాట్లాడుతూ మారుతున్న జీవనశైలిలో భాగంగా యువత ఇంటికే పరిమితం అవుతున్నారు. ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీల ముందు కూర్చుని కాలక్షేపం చేస్తున్నారని కానీ పార్కులకు వెళ్లడం గానీ వ్యాయామాలు చేయడం లేదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వయసుతో తేడా లేకుండా పుట్టిన శిశువు నుండి పెద్దవారికి వరకు గుండె సమస్యలు వస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం తమ దినచర్యలో భాగంగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. కర్నూలు జిల్లా ప్రజల ఆరోగ్యాని దృష్టిలో పెట్టుకొని కిమ్స్ హాస్పిటల్స్ వాళ్లు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.  ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్టులు డా. నాగేంద్ర ప్రసాద్, డా. సందీప్ కుమార్, డా. అరుణ, డా. ఫరూక్ ,  కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు సీఓఓ డా. సునీల్ శేపూరి  , డా. గోపినాథ్, డా. నవీన్, డా. సుమంత్, ఇతర కన్సల్టెంట్లు, హాస్పిటల్ సిబ్బంది, నర్సింగ్ టీంలు, మైపర్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

About Author