ఘనంగా సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హోశగుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమానుల్లా ఆధ్వర్యంలో ఇండియా కూటమి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వర్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిప్పగిరి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీమతి సోనియా గాంధీ అని ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేసి గోప్ప నాయకురాలని, ఏ పదవి కాంక్ష లేని త్యాగ మూర్తిగా చరిత్రలో నిలిచిపోతారని ఆ భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు మెండుగా ప్రసాదించాలని, భారతదేశానికి సంక్షేమ అభివృద్ధి పాలనకై ఆమె తగు సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామాంజనేయులు, మాజీ మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, కరెంటు గోవిందు, వరకుమార్, తిమ్మప్ప, నవీన్, వెంకటేష్, ఎమ్మార్పీఎస్ పత్తికొండ డివిజన్ ఉపాధ్యక్షులు వెంకటేష్, గిరి, వీరాంజనేయులు, రాజేష్, కురుకుంద రాజు, పక్కీరప్ప మరియు మంగయ్య పాల్గొన్నారు.