మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో మునిసిపల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మునిసిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు యల్లప్ప, శివకృష్ణ ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి తిమ్మ గురుడు వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వము ఇంజనీరింగ్ వర్కర్స్ ద ఆఫీస్ వర్కర్స్ కు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మినిట్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ప్రతి కార్మికునికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఆక్యూపెన్సి పెంచాలని సరెండర్ లీవులు ఇవ్వాలని ఎమ్మిగనూరు మున్సిపల్ పరిధిలో పనిచేస్తూ మరణించినటువంటి పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యో గo ఇవ్వాలని క్లాప్ డ్రైవర్స్ ని విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ కార్మికులపై వేధింపులు ఆపాలని అదనంగా కార్మికులను తీసుకోవాలని వారన్నారు. ధర్నా అనంతరం మునిసిపల్ మేనేజర్ వరప్రసాద్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్మికులు చిన్న రంగడు,హరిప్రసాద్, ఈరన్న,సోమయ్య, ఎఐటియూసి నాయకులు విజయేంద్ర, కాజా, నరసింహులు, రామంజి, ఖాదర్,సమీర్, మదిలేటి, నరసింహులు, నాగరాజు, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.