దేశ ప్రధాని పదవినే త్యాగం చేసిన సోనియా గాంధీ
1 min readజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పరిగెల మురళీకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దేశ అత్యున్నత ప్రధాని పదవినే తృణప్రాయంగా తిరస్కరించి త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ త్యాగశీలి అని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు పాలకమండలి మాజీ సభ్యులు, పరిగెల మురళీకృష్ణ ఆమె త్యాగాన్ని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు శ్రీమతి సోనియా గాంధీ బర్తడే సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీమతి సోనియా గాంధీ అంది వచ్చిన ప్రధాని పదవినే తృణప్రాయంగా తోచిపుచ్చి పార్టీ సీనియరయిన ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ ని ప్రధాని పదవి సీట్లో కూర్చోబెట్టిందని ఆమె పార్టీ కోసం చేసిన త్యాగాలను కొనియాడారు. అధికారం కోసం వెంపర్లాడే ఈరోజుల్లో ప్రధానమంత్రి పదవిని సైతం తీసుకోకుండా మన్మోహన్ సింగ్ ని రెండుసార్లు అనగా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రధానమంత్రిగా చేసిన ఘనత సోనియా గాంధీ కే దక్కిందనీ వారి కుటుంబంలో ఇందిరాగాంధీ గారు మరియు సోనియా గాంధీ భర్త మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ దారుణ హత్యలకు గురైన కూడా భయపడకుండా దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తన ఇద్దరు పిల్లలను కూడా ప్రజల్లోకి పంపి ప్రజాసేవకే అంకితం అవమని పంపించిన ఘనత సోనియా గాంధీ కే దక్కుతుందనీ కావున దేశ భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోనికి తీసుకువచ్చి వారి కుటుంబ త్యాగాలకు సార్ధకత చేకూర్చారని ఈ సందర్భంగా మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. ముందుగా శ్రీమతి సోనియా గాంధీ పేరుతో కేక్ కట్ చేసి శ్రీమతి సోనియా గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ నినాదాలు చేశారు. అనంతరం కార్యకర్తల సమావేశం జరిగినది.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర బాబు, కర్నూలు సిటీ అధ్యక్షులు షేక్ జిలాని భాష, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, కాంగ్రెస్ నాయకులు యన్ సి బజారన్న, కె సత్యనారాయణ గుప్త, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ప్రధాన కార్యదర్శి, ఎన్ సుంకన్న, ఎస్ ప్రమీల, అనంతరత్నంమాదిగ, బి సుబ్రహ్మణ్యం, షేక్ మాలిక్, జాన్ సదానందం, అబ్దుల్ హై, పశుపల ప్రతాపరెడ్డి, రమేష్, అక్బర్, రంగస్వామి ఐఎన్టియుసి నాయకులు ఆనందం, మహేష్, మహిళా కాంగ్రెస్ హైమావతి, సుజాత, మల్లేశ్వరి, రమణమ్మ ,శ్రీలత, మాణిక్యాలు, సలోమి మొదలు వారు పాల్గొన్నారు.