NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘స్మార్ట్’రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

1 min read

నెలలోపు జలకనూరు చెరువుకు రింగ్ బండ్..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట క్యూ ఆర్ కోడ్ కొత్త ‘స్మార్ట్’ రేషన్ కార్డులను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పంపిణీ చేశారు.సోమవారం సా 5 గం.కు తహసిల్దార్ టి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై కొత్త కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలానికి కొత్తగా 13,226 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్డులను గ్రామాల్లో వారి ఇంటికి వెళ్లి కార్డులను ఇవ్వాలని అంతేకాకుండా నిత్యవసర సరుకులు తీసుకు వెళ్లలేని వారి ఇండ్లకు వెళ్లి రెవెన్యూ సిబ్బంది సరుకులు అందజేయాలని అన్నారు. గతంలో రేషన్ కార్డుల్లో తప్పులు జరిగాయని అలా కాకుండా పకడ్బందీగా ప్రభుత్వం ఈ కార్డులను తీసుకువచ్చిందని వీటిలో యజమాని ఫోటోతో ఉన్నాయని కార్డులో తప్పులు ఉన్నట్లయితే వెంటనే వీటిని సవరించుకోవాలని మండలానికి హంద్రీనీవా నుండి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు నీటిని తీసుకువస్తామని తర్వాత జలకనూరు మద్దిగుండం చెరువు గండి మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యాయని వర్షాలు తగ్గిన వెంటనే నెలలోపు రింగ్ బండ్ వేయిస్తామని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీవో దశరథరామయ్య, మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి, ఆర్ఐ జహంగీర్,ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ యాదవ్,సీనియర్ అసిస్టెంట్ రాధిక,విఆర్ఓ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author