గుప్పెడు గుండెను కాపాడుకుందాం
1 min read
‘ జెమ్ కేర్ ’ కార్డియాలజిస్టులు డా. చెరుకు రాఘవేంద్ర, డా. సుధీర్ కుమార్
– హైటెక్నాలజీతో గుండెకు మెరుగైన చికిత్సలు అందిస్తాం..
– జెమ్ కేర్ కామినేని సీఈఓ, ఎండి డా. చంద్ర శేఖర్
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు : మనిషి జీవన మనుగడలో కీలకమైన పాత్ర పోషించేది గుండెనని, అటువంటి గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ కార్డియాలజిస్టులు డా. చెరుకు రాఘవేంద్ర, డా. సుధీర్ కుమార్. సెప్టెంబరు 29న ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సోమవారం జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ సీఈఓ, ఎండి. డా. చంద్ర శేఖర్ నేతృత్వంలో ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు హాస్పిటల్ నుంచి రాజ్ విహార్ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కార్డియలజిస్టులు మాట్లాడుతూ ఆధునిక సమాజంలో గుండె నొప్పితో బాధ పడే వారు, మరణించే వారి సంఖ్య అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు వ్యాయామం, పౌష్టిక ఆహారం తీసుకోవాలని, ఆల్కహాల్, సిగరేట్ , ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న పనిలో శారీరక శ్రమను భాగం చేసుకోవాలన్నారు. స్థూలకాయం వారికి గుండె జబ్బులు త్వరగా వస్తాయని, అటువంటి వారు సైకిల్ తొక్కడం, రోజు ఉదయం, సాయంత్రం అరగంట నడవడం చేయాలన్నారు. అనంతరం హాస్పిటల్ ఎండి, సీఈఓ డా. చంద్ర శేఖర్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో గుండెకు చికిత్స చేసే విధానం తమ హాస్పిటల్ లో ఉందన్నారు. తక్కువ ఖర్చుతోనే మెరుగైన చికిత్స చేస్తామని, వైద్యులు కూడా నిత్యం అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ తరువాత ట్రాఫిక్ సీఐ షుంషుద్దీన్ మాట్లాడుతూ జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ నేతృత్వంలో గుండెను కాపాడుకుందాం.. అని అవగాహన ర్యాలీ నిర్వహించడం అభినంనీయమన్నారు.ఆ తరువాత హాస్పిటల్ లో కేక్ కట్ చేసి , రోగులకు, సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్లు రవి బాబు, బాల మురళీ కృష్ణ, రామ్మోహన్ రెడ్డి, పవిత్ర, సునీత మరియు షేక్షావలి సీఓఓ , జీఎం రమణ, నదీమ్ తదితరులు పాల్గొన్నారు.



