చాగంటి నియామకం అత్యుత్తమం ..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నైతిక విలువల పెంపుదల కమిటీకి గౌరవ సలహాదారుగా గౌరవనీయులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు ని నియమించడం ఎంతో ఉత్తమమైన విషయం. భారతదేశ విలువలు నిండుగా ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని నైతిక విలువల కమిటీకి సలహాదారుగా తీసుకోవడం అద్భుతమైన విషయం. దీనిని కొంతమంది కమ్యూనిస్టులు, మేధావుల పేరుతో వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి లేఖ రాయడం చాలా దారుణమైనటువంటి విషయం. వీటిని హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కురువ చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. చైనా భావజాలాన్ని భారతదేశంలో పెంపొందించి దేశ వ్యతిరేకమైనటువంటి క్రియలు పోషించే వీరు ఇటువంటి మాటలు మాట్లాడడం సర్వసాధారణం. కావున గౌరవనీయులు చంద్రబాబునాయుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఆమోదించి హర్షం తెలియజేశారు. ఇటువంటి కొంతమంది విదేశీ మేధావుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో తెలియజేశారు.