క్రీడాకారులకు అభినందన
1 min readపతకాలతో సన్మానించిన త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమి చైర్మన్ డా. త్రినాథ్
కర్నూలు, పల్లెవెలుగు: ప్రతి విద్యార్థి చదువుతోపాటు ఏదో ఒక క్రీడలో రాణించాలని సూచించారు త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్ డా. త్రినాథ్. డిసెంబరు 7,8వతేదీలలో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు బంగారు, వెండి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. కర్నూలు జిల్లా కి చెందిన విద్యార్థులు తలారి గణేష్ (మ్యూజికల్ ఫామ్ ఈవెంట్లో బంగారు ), ఉప్పరి ఉపేంద్ర (పాయింట్ ఫైట్ ఈవెంట్లో 57 కేజీ విభాగంలో బంగారు), జి హరి కళ్యాణ్ (ఫుల్ కాంటాక్ట్ ఈవెంట్లో 75 కేజి వెండి పతకం), జి జయ కళ్యాణ్ (పాయింట్ ఫైట్ ఈవెంట్ లో 63 కేజీ విభాగంలో బంగారు పథకాలు సాధించారు. సోమవారం నగరంలోని త్రినాథ్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్ డా. త్రినాథ్ క్రీడాకారులను అభినందించి… సన్మానించారు. క్రీడాకారుల విజయానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన కోచ్ నరేంద్రను ప్రశంసించారు. భవిష్యత్లో మరిన్ని బంగారు పతకాలు సాధించాలని సూచించిన డా. త్రినాథ్ … క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.