PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెయింట్ థెరీసా మహిళా అధ్యాపకులకు పలు విభాగాలలో డాక్టరేట్​ పట్టభద్రుల సత్కారం

1 min read

అర్హత సాధించిన అధ్యాపకులకు పలువురు ప్రశంసలు

పల్లెవెలుగు వెబ్  ఏలూరు జిల్లా ప్రతినిధి: స్థానిక సెయింట్ థెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో వివిధ విభాగాలకు చెందిన ఐదుగురు అధ్యాపకులు విజయవంతంగా డాక్టరేట్ పట్టాలను పొందారు. మ్యాథమెటిక్స్ మరియు స్టాటిస్టిక్స్ విభాగానికి చెందిన సీనియర్ అధ్యాపకులు, పీజీ డైరెక్టర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయిన డాక్టర్ సుశీల” మ్యాథమెటికల్ అప్లికేషన్ ఇన్ మోడలింగ్ అండ్ యుటిలైజేషన్ ఆఫ్ రోబోట్స్ ఇన్ సిట్యుయేషన్ ఆఫ్ పాండేమిక్” అనే అంశంపై ఆమె చేసిన విశేషమైన పరిశోధనకు గాను డాక్టరేట్ పట్టాను పొందారు.కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆంగ్ల అధ్యాపకురాలు అయిన డా:సిస్టర్ మరియ క్రిస్టియా  పాపల్  ఎన్సైక్లికల్స్లో సోషియో ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ రివ్యూ ఆఫ్ ద పీరియడ్(1891,2020) పై ఆమె చేసిన అధ్యయనానికి డాక్టర్ పటాను సాధించారు.ఆంగ్ల విభాగానికి చెందిన డాక్టర్ గాలి దుర్గా వైష్ణవి సమకాలీన రచయిత్రులు కవితా కేన్ మరియు నేటెడ్ రాసిన భారతదేశం మరియు గ్రీక్ ప్రాణాల యొక్క రచనలలో స్త్రీ గుర్తింపుఅనే అంశంపై పరిశోధన చేశారు.అదే విభాగానికి చెందిన డాక్టర్: దాసరి మణి భాగ్యశ్రీ ప్రవాస సాహిత్యకారులైనచిత్ర బెనర్జీ దివాకారుని మరియు అమ్మండ ఎలియట్ యొక్క రచనలలో పురాణాలు మరియు జానపద సాహిత్యం అనే అంశంపై పరిశోధన గావించారు.ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన అధ్యాపకురాలు డాక్టర్ ఎం షారోన్ సుష్మ విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ నుంచి పాలలో మైక్రో ప్లాస్టిక్లను గుర్తించడం మరియు వాటి వర్ణన అనే అంశంపై పరిశోధన గావించి డాక్టరేట్ పట్టాను పొందారు. డాక్టరేట్ పట్టాలను పొందిన పలువురు అధ్యాపకులను ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ, మరియు వివిధ విభాగాధిపతులు,  అధ్యాపకులు అభినందించారు.

About Author