మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోడపత్రికలు ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మానవ హక్కుల పరిరక్షణ అవగాహన కార్యక్రమంలో నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ,ఆక్సిస్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మానవ హక్కుల పై అవగాహన గోడపత్రికలను శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ రిటైర్డ్ జిల్లా జడ్జి వెంకట హరినాథ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ మనోహర్ ,డి .సి .పి. ఓ శారద, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు ఆవిష్కరించారు.