ప్రపంచ ధ్యాన దినోత్సవ తీర్మానం హర్షణీయం
1 min readయోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యవర్గ సభ్యుడు అవినాష్ శెట్టి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని డిసెంబర్ 21నజరుపుకోవాలంటూ భారత్, చైనా,రష్యా,జపాన్ తదితర దేశాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 193 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించడంపైయోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యవర్గ సభ్యుడు,రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శిఅవినాష్ శెట్టి హర్షం వ్యక్తం చేశారు.మంగళవారం కర్నూలు కేంద్రంగా యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అనుబంధ యోగా శిక్షకులు,న్యాయ నిర్ణీతల,రాష్ట్ర,జిల్లాల అసోసియేషన్ సభ్యులతో జూమ్ మీటింగ్ ద్వారా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ధ్యాన్ దివస్ విశ్వమానవ పరివర్తన,శాంతి స్థాపనకు ఆధారంకాగలదని ఆకాంక్షించారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉన్న ప్రభుత్వ,బీసీ వసతి గృహాలు,విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఉచిత ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించి యోగాతో పాటు ధ్యానం పై అవగాహన కల్పించాలని కోరారు.రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో డిసెంబర్ 21వ తేదీన ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలని కోరారు. అంతకుముందు భారత ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర యోగా సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.