నేడు కర్నూలులో సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మకమైన షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనుంది.తన 40వ షోరూంను కర్నూలులో ఏర్పాటు చేస్తోంది.ఈ షోరూంను నేడు ప్రారంభించనున్నట్లు మంగళవారం సీఎంఆర్ ప్రతినిధులు తెలిపారు.ఈ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీనటులు సంయుక్త మీనన్,మీనాక్షి చౌదరి,మాజీ రాజ్యసభ్యులు టి.జి.వెంకటేష్,పరిశ్రమలు వాణిజ్యం,ఆహార శుద్ధి శాఖ మంత్రి టీ.జీ.భరత్,ఎమ్మెల్యేలు గౌరుచరిత రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి,బొగ్గుల దస్తగిరి, కోడుమూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు డి.విష్ణువర్ధన్ రెడ్డి, మొదటి కొనుగోలు దారుడు,కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరువుతున్నట్లు చెప్పారు.ఈ షాపింగ్ మాల్లో ప్రత్యేకంగా సిల్క్ శారీ కలెక్షన్స్,కిడ్స్, మెన్స్వేర్తో పాటు పెళ్లి పట్టుచీరలు,కొత్త కొత్త మోడల్స్ విభాగాలు ఏర్పాటు చేశారు. విలాసవంతమైన షాపింగ్ అనుభవాలతో సంప్రదాయ,భవిష్యత్ డిజైనర్ డ్రెస్ మెటీరియల్స్ ను దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ శ్రేణి వస్త్రశ్రేణి సంస్థగా హెూల్ సేల్ ధరలకే వినియోగదారులకు సేవలందిస్తున్నామని పేర్కొన్నారు.కర్నూలు ప్రాంతవాసుల నుంచి వస్తున్న ఆదరణ, విశ్వాసం గుర్తించి వారికి చేరువలో ఓ మాల్ ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడ ఈ బ్రాంచ్ ను ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు. ఎల్లవేళలా వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని వారు పేర్కొన్నారు.