వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవోకి వినతిపత్రం అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపుమేరకు గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం పత్తికొండ ఆర్డిఓ డాక్టర్ భరత్ నాయక్ కు స్థానిక గ్రామ రెవెన్యూ సహాయకులు వినతి పత్రం అందజేశారు. అర్హత కల్గిన వీఆర్ఏ లకి నైట్ వాచ్ మెన్ ప్రమోషన్స్ కల్పించాలని , వీఆర్ఏలకి పే స్కేల్, 24000/- వేతనం పెంచాలని, నామినిలను రెగ్యులర్ వీఆర్ఏ లు గుర్తించాలని, వీఆర్ఏ లనుండి ప్రమోషన్స్ కోట 30% నుండి 70% పెంచాలని కోరుతూ, వారి డిమాండ్స్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన న్యాయం చేయాలనీ పత్తికొండ ఆర్డీవో కి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఆర్డీవో స్పందిస్తూ వీఆర్ఏ నుండి నైట్ వాచ్ మెన్ ప్రమోషన్స్ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సానుకూలంగా స్పందించారు. మిగతా డిమాండ్స్ ని కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామని సూచించారు.ఈ కార్యక్రమం లో వీఆర్ఏ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు T. G రామాంజినేయులు, కర్నూలు జిల్లా అధ్యక్షులు N. చిన్నస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి T. శేఖర్, జిల్లా సహధ్యక్షులు T. సోమప్ప, జిల్లా ఉపాధ్యక్షులు T. రమేష్, జిల్లా జాయింట్ సెక్రటరీ తాయప్ప, B.T గోవిందు పత్తికొండ మండల వీఆర్ఏ లు లింగన్న, మల్లి,శరీఫ్, మరియు పత్తికొండ డివిజన్ లో వీఆర్ఏ లు తదితరులు పాల్గొన్నారు.