పీఎం శ్రీ పనులు వేగవంతం చేయండి
1 min readవిద్యాశాఖ రాష్ట్ర అదనపు సంచాలకులు వియన్ మస్తానయ్య..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పీఎం శ్రీ పథకం కింద చేయాల్సిన సివిల్ ఇంజనీరింగ్ పనులన్నీ సత్వరమే పూర్తి చేసి డిసెంబర్ 31 నాటికి వాడుకలోకి తీసుకురావాలని విద్యాశాఖ రాష్ట్ర అదనపు సంచాలకులు వి యన్ మస్తానయ్య ఆదేశించారు. మంగళవారం ఉదయం డిఈవో కార్యాలయంలో పీఎం శ్రీ జిల్లావ్యాప్తంగా సివిల్ ఇంజనీర్లతో ఆయా పనులపై సమీక్ష నిర్వహించారు. పనులు ఏ దశలోనూ ఆగిపోవడానికి వీల్లేదని ఈ పనులపై ప్రభుత్వానికి అంచనాలు ఉన్నాయని పనులపై నిర్లక్ష్యం పెట్టాలన్నారు. బిల్లు అప్లోడ్ కు సంబంధించి సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల ఇంజనీర్లతో ఒక్కొక్కరిని ఆయన మండలాలు జరుగుతున్న పనుల వివరాలు అడిగి ఏ దశలో సాగుతున్నది ఎప్పటికీ పూర్తి చేస్తారని విషయాలపై ఆరా తీశారు. పిఎమ్ శ్రీ పాఠశాలలకు ప్లే గ్రౌండ్లు, కెమిస్ట్రీ ల్యాబ్లు సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఏపీ ఆర్ ఎస్ పాఠశాలాల్లో జరుగుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమన్వయం చేసుకొని పనులను వేగవంతంగా నాణ్యతగా చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగానే ఏపీఆర్ఎస్ కాల్వబుగ్గ, పత్తికొండ, బనవాసి కర్నూలు ఉర్దూ పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిపై ఇంజనీర్లతో మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం పూర్తయితే నిధుల సమస్య తలుపుతుందని వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు తాగునీటి సౌకర్యం కల్పించే దిశగా గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ వాటర్ స్కీం అధికారులతో మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ అధికారులతో చర్చించి పనులు పూర్తి చేయాలని, సమస్యలుంటే జిల్లా కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు నివేదికల పంపాలని జిల్లా విద్యాధికారి యస్ శ్యామ్యూల్ పాల్ ఆదేశించారు. అవసరమైన చోట పర్యటించి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని డిఈవోను ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ ఏడిలు, నాగభూషణం హాజరయ్యారు.