అల్పపీడనం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్
1 min readజిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అల్పపీడనం పట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 11,12 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని సంసిద్ధం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్–08518 277305 ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు..ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకో వాలని, వీలయితే వరి, పొగాకు పంటలు సాగు చేసిన రైతులు పంటకోతలను వాయిదా వేసుకోవాలని కలెక్టర్ సూచించారు.