ప్రాణశక్తి పెంపుతో ఆరోగ్యం ఆనందం… ఆయుషు
1 min read-డాక్టర్ మా కాల సత్యనారాయణ
పల్లెవెలుగు వెబ్ గుంటూరు: మానవ దేహంలోని ప్రాణశక్తి కేంద్రాలను చైతన్య పరచడంతో మనిషికి ఆరోగ్యం ,ఆనందం, ఆయుషు పెంచవచ్చునని యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. గుంటూరు నల్లపాడు ఎం.బి.టి.ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో జరిగిన ఆరోగ్య అవగాహన సదస్సులో పాల్గొని చికిత్స మరియు శిక్షణ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. మనలో 500 జతల ప్రాణశక్తి కేంద్రాలు మరియు ఆరు క్షేత్రాలు ఉన్నాయని అవి ఎక్కడ ఉన్నది ఎందుకు ఉపయోగ పడతాయో తెలుసుకుని వాడుకోవడం ద్వారా ఎవరికి వారే ఆరోగ్యం ఉంటారు. పలువురికి చికిత్స చేసి ప్రదర్శించినారు. వేల సంవత్సరాలగా వాడుతున్న ఈ విధానం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ తాళ్లూరి శేఖర్ మాట్లాడుతూ తమ కాలేజీ విద్యార్థులు అనారోగ్య బారిన పడకుండా శిక్షణ ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. డాక్టర్ మకాల సత్యనారాయణ 22 సంవత్సరాల కృషి ప్రశంసనీయమైనది అని తెలిపారు. కాలేజీ యాజమాన్యం డాక్టర్ సత్యనారాయణ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ఉపాధ్యాయులు . విద్యార్థులు పాల్గొన్నారు. ఆక్యు ప్రెజర్ తెలపిస్టులు బి. ఉదయ్ కుమార్ మరియు ముంజంపల్లి శివకుమార్ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు.