మున్సిపల్, నగర పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
1 min readఏపి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కే కృష్ణమాచార్యులు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఏపి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేసి నగరపాలక కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కే.కృష్ణమాచార్యులు,భజంత్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్ పరిధిలో సంబంధించి పర్మినెంట్ మున్సిపల్ కార్మికులకు,జనరల్ ఇంక్రిమెంట్లు,స్పెషల్ ఇంక్రిమెంట్లు, మెడికల్ లీవ్ బిల్లులు,రిటైర్మెంట్ అయిన వారికి రావాల్సిన లీవ్ క్యాష్ మెంట్, చెల్లించాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఫిబ్రవరి నెల హెల్త్ అలవెన్స్ చెల్లించాలని, మున్సిపల్ పర్మినెంట్ కార్మికులకు ప్రతి ఏడాది భోగి పండగ రోజు యూనిఫారం,కొబ్బరినూనె, సబ్బులు,చెప్పులు,కుట్టుకూలీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని,రాష్ట్రంలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.32వేలు నెలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఉన్న ఔట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డిగర్ల నాగబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు యలగాడ శివకుమార్, బంగారు దుర్గాప్రసాద్,ఏలూరు నగరపాలక యూనియన్ సభ్యులు బంగారు రాజు, పొద్దుటూరు సురేష్, కరపాటి నాగరాజు,బంగారు మధు, ప్రసాదు,సతీష్, బంగారు అంకమ్మ, బంగారు లక్ష్మీ, ఆర్జీ సత్యవతి, తంగెల ఉమా, కారే మరియదాసు, వై.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.