ముఖ్యమంత్రి ని కలిసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
1 min readఅభివృద్ధికి సహకరించాలని వివరణ
సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కలిసి ఏలూరు నియోజకవర్గ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లరు. పలు అంశాలను ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా మాట్లాడి వివరించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.