ఉపాధ్యాయులు పిల్లలకు చదువు నేర్పించడం ఒక బాధ్యత
1 min readఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
విద్యార్థి దశ నుంచే బాల,బాలికలు క్రమశిక్షణతో కూడిన అలవాట్లను అలవర్చుకోవాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: పెదపాడు మండలం వట్లూరులోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమ్మేళనలో కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు పిల్లలకు చదువు నేర్పించడం ఒక బాధ్యత అయితే తల్లిదండ్రులుగా ఆ పిల్లల విద్య అభ్యాసన, వారిలో టాలెంట్ ఇతర అంశాలను పరిశీలించి తెలుసుకోవలసినఅవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్ధులను బాధ్యత కలిగిన పౌరుడిగా తీర్చిదిద్దడంలో పాఠశాలపై ఎంతో బాధ్యతఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు దేశానికి అవసరమైన ఉత్తమ పౌరులను అందించే దిశగాఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. గురుకుల పాఠశాలలో విద్యాబోధన ఇతర కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఏవైనా సమస్యలు గానీ, ఇబ్బందులు ఉంటే విద్యార్ధినుల తల్లిదండ్రులు నిర్భయంగా తెలియచేయవచ్చని అన్నారు. ఈ సందర్భంగా పెదపాడు మండలం పాతముప్పర్రురకుచెందిన ధను అనే మహిళ మాట్లాడుతూ తమ పాప ఇక్కడ పదవ తరగతి చదువుతున్నదని, గురుకుల పాఠశాలలో తమపిల్లను ఇంటికన్నా మిన్నగా చదువు, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. పుష్పలత అనే మహిళమాట్లాడుతూ తమ పిల్లలను గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో చేర్చించానని, ప్రస్తుతం వారు 8వ తరగతికిచేరుకున్నారని, ఇక్కడ చదువు బాగా చెప్పటంతో పాటు వారి బాగోగులు కూడా ప్రిన్సిపల్ నుండి ఉపాధ్యాయులు వరకుఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో 10వ తరగతి ఫలితాలలో 94 శాతం సాధించారని రానున్న కాలంలో ఇది నూరు శాతం చేరాలని ఆకాంక్షించారు. పిల్లలందరినీ చూడగానే ఎంతో సంతోషం కలిగిందని పెద్దఎత్తున తల్లిదండ్రులు హాజరు కావడం మంచి పరిణామమనిఅన్నారు. తొలుత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ వెట్రిసెల్వి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం పాఠశాల విద్యార్ధినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏలూరుఆర్డీవో అచ్యుత్ అంబరీష్ డిఇవో వెంకటలక్ష్మమ్మ, ఎంఈఓ లు నరసింహమూర్తి, రమలు,కళాశాల ప్రిన్సిపల్ ఝాన్సీరాణి,తహసీల్దార్ జ్యోతికృష్ణ తదితరులు పాల్గొన్నారు.