ఘనంగా విన్ కేబుల్ న్యూస్ ఎడిటర్ రాజు జన్మదిన వేడుక
1 min readశుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఉద్యోగులు,వ్యాపారవేత్తలు, స్నేహితులు,బంధుమిత్రులు
నిరంతరం మీ అందరి వాడిగా స్నేహితుడిగా మీతో ఉంటా
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: సీనియర్ జర్నలిస్ట్ విన్ కేబుల్ న్యూస్ ఎడిటర్ రాజు జన్మదిన వేడుకలు రెవెన్యూ భవన్ లో మంగళవారం ఘనంగా జరిగాయి.పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుండి అన్ని మాధ్యమాలలో, గ్రూపులలో శుభాకాంక్షలు తెలుపుతూ అదే విధంగా స్వయంగా వచ్చి పూల బొకేలతో శాలువా కప్పి స్వీట్స్ తినిపించి పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉద్యోగులు వ్యాపారవేత్తలు స్నేహితులు బంధుమిత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాకు మెసేజ్ లు మరియు ఫోన్ కాల్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా నిరంతరం మీ అందరి వాడిగా మీ రాజుగా ఉంటానని హామీ ఇస్తూన్న అని అన్నారు. కార్యక్రమానికి యూనియన్ పెద్దలు మరియు యం టీవీ అధినేత మాణిక్యరావు, సిటీ కేబుల్ న్యూస్ ఎడిటర్ రఘు, ఆంధ్రజ్యోతి బ్యూరో రాజు, మరియు సీనియర్ జర్నలిస్టులు,తోటి సోదరులు, పెద్దలు కెమెరామెన్లు నగర ప్రముఖులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్న అని శిరస్సు వంచి నమస్కరిస్తూ తన జన్మదిన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రాజు తెలిపారు.