ఆదోని మాత,శిశు ఆస్పత్రిని..వంద పడకల ఆస్పత్రిగా మార్చండి
1 min readఆదోని, పల్లెవెలుగు: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ కేంద్రంలోని మాతా, శిశు సంక్షేమ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చాలని విజయవాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారి డా. శిరీష ను ఎమ్మెల్యే డా. పార్థసారధి కోరారు. బుధవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డా. పార్థసారధి… ఆదోని మాతా శిశు ఆస్పత్రిని వందల పడకల ఆస్పత్రిగా మార్చాలని విన్నవించారు. ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలతోపాటు కర్ణాటక నుంచి కూడా వచ్చిన గర్భిణీలు ఆదోని ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటారని, ఇక్కడ 50 పడకలు మాత్రమే ఉన్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని డైరెక్టర్ ఆఫ్ సెకండరరి హెల్త్ అధికారి డా. శిరీషకు వివరించారు. ఈ విషయంపై మంత్రులు, కలెక్టర్, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, ఇందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు డా. శిరీషకు వెల్లడించారు.
ఆదోని ప్రజల హర్షం..
నియోజకవర్గ కేంద్రంలో నెలకొన్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా అధికారులు, మంత్రులు, సీఎం దృష్టికి తీసుకెళ్తూ… పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే డా. పార్థసారధి ని కూటమి నేతలు, ప్రజలు అభినందించారు. ఆదోని మాతా శిశు ఆస్పత్రిలో 50 పడకలు మాత్రమే ఉన్నాయని, సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారని ప్రభుత్వానికి స్పష్టంగా వివరించడం ప్రశంసనీయమన్నారు. ఆదోని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న డా. పార్థసారధి నిబద్ధతకు నియోజకవర్గ ప్రజలు, కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు.