లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు అంతర్జాతీయ స్థాయి అవార్డు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గత 30 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సేవా సంస్థ అధ్యక్షులు , నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ,ఆల్ ఇండియా జాతీయ కార్యదర్శి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు నైజీరియా కు చెందిన గుడ్ సమారిటన్ థియలాజికల్ సెమినరీ అండ్ పీస్ అకాడమీ ఛాన్స్లర్ ఆర్చి బిషప్ అంబాసిడర్ డాక్టర్ జె. పి అదే హెరాల్డ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన మైక్ వర్సిటీ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైక్ లిటమన్ లు సంయుక్తంగా నేడు జరిగిన అంతర్జాతీయ అంతర్జాల సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా సేవా సంస్థలకు అంతర్జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఈ అంతర్జాతీయ స్థాయి అవార్డును ప్రధానం చేశారు. ఈ అవార్డుతోపాటు సేవారంగంలో అంతర్జాతీయ స్థాయి ఉత్తమ సేవకుడిగా ప్రశంశా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయి అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అవార్డు స్ఫూర్తితో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అంతర్జాతీయ సంస్థల సహకారంతో అంతర్జాతీయ సదస్సులు ప్రపంచ శాంతి, మానవహక్కులు తదితర అంశాలపై అంతర్జాతీయ సదస్సులు నిర్వహించనున్నామన్నారు.