ఆటోమెటిక్ పార్కింగ్ సిస్టం ప్రాజెక్ట్స్ పై శిక్షణ
1 min readముఖ్య అతిథిగా పాల్గొన్న రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ హెచ్. ఆర్.ప్రసాద్
ఉపాధ్యాయులకు సర్టిఫికెట్స్ అందజేత
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులం, వట్లూరు నందు గత మూడు రోజులుగా జరుగుతున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ వర్క్ షాప్ బుధవారం తో ముగిసింది.ఈ మూడు రోజుల్లో స్ట్రింగ్ ఆర్ట్, ఫ్యాన్ ఆటో మిషన్, ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ మీద శిక్షణ ఇవ్వడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రామచంద్ర కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, ఏలూరు హెచ్.ఆర్. ప్రసాద్ పాల్గొని శిక్షణలో నైపుణ్యం చూపించిన ఉపాధ్యాయులను అభినందించారు. దానిలో భాగంగా డి.ఎస్.ఓ సోమయాజులు, కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి చేతుల మీదుగా ఉపాధ్యాయులకు సర్టిఫికెట్స్ అందించి అభినందించారు.