ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి…
1 min readపల్లెవెలగు వెబ్ కర్నూలు: నగరపాలక సంస్థకు ఆదాయం పెంపునకు మార్గాలను అన్వేషించాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ అధికారులను సూచించారు. గురువారం పాత బస్టాండ్ కేఎంసి పెట్రోల్ పంపు, కింగ్ మార్కెట్ వద్థ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ను రెవెన్యూ విభాగం అధికారులతో కలిసి అదనపు కమిషనర్ పరిశీలించారు. పెట్రోల్ పంపులో పలు రిజిస్టర్‌లను పరిశీలించి, అనంతరం సిబ్బందితో మాట్లాడారు. గత కొంతకాలంగా నెలకొన్న కొన్ని సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే పెట్రోల్ పంపు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అదనపు కమిషనర్ అధికారులను ఆదేశించారు. అనంతరం కింగ్ మార్కెట్ వద్ద మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ను పరిశీలించిన అదనపు కమిషనర్, మున్సిపల్ వ్యాపార సముదాయాల్లో అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్.ఓ. జునైద్, ఆర్.ఐ. శేషాద్రి, ప్రత్యేక అధికారి జి.ఎం. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.