30 లీటర్ల నాటు సారా, ఒక ద్విచక్ర వాహనం సీజ్:ఎక్సైజ్ సీఐ
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ యస్. రవికుమార్ అదేశాల మేరకు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల వి.రాముడు ఆధ్వర్యంలో యస్.కిశోర్ కుమార్ ఆత్మకూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారి అధ్వర్యములో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, పి.జగదీష్ వారి సిబ్బంధి,కలిసి ఆత్మకూర్ మండల పరిధిలో గల సిద్దాపురం గ్రామ సమీపములో దాడులు నిర్వహించి నాటు సారాయిని రవాణా చేస్తున్న మాణిక్యల మహేశ్ మరియు మాణిక్యల ప్రతాప్ అను ఇద్దరు వ్యక్తుల నుండి 30 లీటర్ల నాటు సారాను మరియు ఒక ద్విచక్ర వాహనమును స్వాధీనము చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడులలో బాదుల్లా , రామచంద్రుడు , కృష్ణుడు,తిక్కయ్య కానిస్టేబుల్లు మరియు రామ కృష్ణుడు హెడ్ కానిస్టేబుల్ పాల్గొన్నారు తదుపరి ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారీ, అమ్మకాలకు పాల్పడినట్లయితే ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.