PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించాలనేది ప్రాతిపదికగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలి

1 min read

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం

రెండవ రోజు జిల్లా కలెక్టర్ల్ల సమావేశం

పాల్గొన్న రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి  కొలుసుపార్ధ సారధి,

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి:కలెక్టర్ల సదస్సులో జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలపై సంబంధిత శాఖల వారీగా సమగ్ర నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రభుత్వానికి అందజేశారు.  ఇందులో భాగంగా జిల్లా అభివృద్ధికి యంత్రాంగం రూపొందించిన విజన్-2047 ప్రణాళికను కూడా అందజేశారు.  రాష్ట్రస్ధాయి విజన్ ప్లాన్ ను ఈనెల 13న రాష్ట్ర ప్రభుత్వం తరపున గా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విడుదల చేయనున్నారు.  అందులో భాగంగా జిల్లా, మండలస్ధాయి ప్రణాళికలను తయారు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అన్ని జిల్లాలు, మండలాల్లో వాటిని రూపొందించారు.రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పరిశ్రమలు, ఐటీ పార్కులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ఉద్యోగాల కల్పన చాలా ప్రధానమైన అంశంవచ్చే సమావేశానికి ఒక్కో జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే వివరాలతో రావాలినియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలిరైతులను భాగస్వాములను చేయండి.అంతిమ లబ్దిదారులుగా వారుండేలా ప్రోత్సహించాలిపరిశ్రమలకు అనుమతులిచ్చే విషయంలో అసలత్వం తగదు.గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడ్డారు.ఇప్పుడు  ఆ పరిస్థితి పోగొట్టి మళ్లీ అనుకూల వాతావరణం కల్పించాలి.-కలెక్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశంప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనేది ప్రాతిపదికగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆ శాఖ ప్రగతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సీఎం మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి జిల్లాలోనూ ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి? వచ్చిన పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రతి జిల్లా కలెక్టరు రాబోయే కలెక్టర్ల సదస్సుకు దీనిపైన స్పష్టమైన వివరాలతో రావాలని సూచించారు. పెట్టుబడులకు సంబంధించి జిల్లాలో నిర్వహించాల్సిన సమావేశాల పట్ల కలెక్టర్లు శ్రద్దకబరచకపోవడంపై సీఎం అసంత్రుప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలు అసలు ఒక్క సమావేశం నిర్వహించకపోవడం సరికాదన్నారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ పనులు వేగవంతంగా చేయాలన్నారు. . ఐటీ పార్కుల కొరకు భూములు గుర్తించండిరాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి సంబంధించి భూములు గుర్తించడానికి కలెక్టర్లు పనిచేయాలన్నారు. విశాఖపట్నంలోని మధురవాడ, కాపులుప్పాడలో 200 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించిన స్థలాన్ని గుర్తించాలన్నారు. అలాగే మంగళగిరిలో ఐటీ పార్కు ఏర్పాటుకు కావాల్సిన 200 ఎకరాల స్థలం గుర్తించాలన్నారు. కడపలోని కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే తిరుపతిలో కూడా ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ కొరకు 500 ఎకరాల స్థలం గుర్తించే అంశంపైనా ఆ జిల్లా కలెక్టరు ప్రయత్నించాలని కోరారు. అలాగే తిరుపతి నగర పరిధిలో ఐటీ పార్కు ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం కావాలన్నారు. తిరుపతిలో నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (National Institute of Electronics and Information Technology –NIELIT) ఏర్పాటుకు అవసరమైన 15 ఎకరాల స్థలాన్ని కూడా వెంటనే గుర్తించాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *