రైతుకు లివర్ లో రాళ్లు…
1 min readఅత్యంత అరుదైన సమస్య
దాంతోపాటు.. సన్నబడిన చిన్నపేగు
కిమ్స్ సవీరా ఆస్పత్రిలో సంక్లిష్ట శస్త్రచికిత్స
వదిలేస్తే క్యాన్సర్‌గా మారే ప్రమాదం
పల్లెవెలుగు వెబ్ అనంతపురం: గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడి.. అవి కాలేయం వరకు వెళ్లిపోయిన రైతుకు అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్. మహమ్మద్ షాహిద్ తెలిపారు. “తాడిపత్రి ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల రైతుకు గతంలో 12 సంవత్సరాల క్రితం బైల్ డక్ట్‌లో రాళ్లు ఏర్పడడంతో దానికి ఒక స్టంట్ వేసి, చిన్నపేగు సన్నబడిపోవడంతో దాన్ని బైపాస్ చేస్తూ శస్త్రచికిత్సలు చేశారు. రెండు నెలల నుంచి మళ్లీ ఆయనకు జ్వరం, కడుపు నొప్పి, కామెర్లు లాంటి లక్షణాలు ఉండడంతో కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనకు అన్నిరకాల వైద్య పరీక్షలు చేయగా, కాలేయంలో చాలా రాళ్లు ఏర్పడినట్లు గుర్తించాం. సాధారణంగా కిడ్నీలు, గాల్ బ్లాడర్‌లో రాళ్లు వస్తాయి గానీ, కాలేయంలో ఉండడం చాలా అరుదు. అయితే, ఆయన బైల్ డక్ట్‌లో రాళ్లు ఏర్పడి, అవి క్రమంగా కాలేయంలోకి వెళ్లిపోయినట్లు గుర్తించాం. దాంతోపాటు చిన్నపేగు బాగా సన్నబడిపోయింది. దాంతో అతడికి రెండు రకాల శస్త్రచికిత్సలు చేశాం. ముందుగా కాలేయంలోని రాళ్లు అన్నింటినీ తొలగించడం, ఆ తర్వాత సన్నబడిన పేగును బైపాస్ చేసి దాన్ని కూడా సరిచేశాం. దీనంతటికీ మొత్తం 6 గంటలు పట్టింది. శస్త్రచికిత్సలు చేసిన పది రోజుల తర్వాత అతడికి ఎలాంటి సమస్యలు లేకపోవడంతో డిశ్చార్జి చేశాం. వారం రోజుల తర్వాత సమీక్షకు వచ్చినప్పుడు కూడా అతడికి నొప్పి, జ్వరం కూడా ఏమీ లేవని నిర్ధారించుకున్నాం. ఇది చాలా సమస్యాత్మకమైన, సంక్లిష్టమైన కేసు. ఇలా బైల్ డక్ట్‌లో గానీ, కాలేయంలో గానీ రాళ్లు ఏర్పడినప్పుడు వాటిని చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే చివరకు క్యాన్సర్‌కు కూడా అవి దారితీసే ప్రమాదం ఉంటుంది. కాలేయంలో రాళ్లు ఏర్పడడం అనే సమస్య తొలిసారిగా 1930లో హాంకాంగ్‌లో బయటపడింది. అది తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. దాదాపు 30% మంది ప్రజల్లో ఈ సమస్య ఉంటుంది. ఆసియా దేశాలకు వచ్చేసరికి తైవాన్‌లో ఇలా కాలేయంలో రాళ్లు ఏర్పడుతున్నట్లు కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇది ఏర్పడడానికి పారాసైటిక్ ఇన్ఫెక్షన్లు కారణం కావచ్చు. కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అన్నిరకాల కాలేయ శస్త్రచికిత్సలు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలు కూడా వీలైనంత తక్కువ ఖర్చుతోనే చేస్తాం. ఇంఉదకు అవసరమైన అన్నిరకాల అత్యాధునిక సదుపాయాలు ఆస్పత్రిలో ఉన్నాయి” అని డాక్టర్ ఎన్. మహమ్మద్ షాహిద్ తెలిపారు.