భక్తిశ్రద్ధలతో తిక్కస్వామి తాత ఉరుసు మహోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: మండల పరిధిలోని చెట్నిహల్లి గ్రామ సమీపంలో వెలసిన శ్రీ తిక్కస్వామి తాత ఉరుసు మహోత్సవం గ్రామ ప్రజల అధ్వర్యంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కస్వామి తాత దర్గా ను వివిద రకాల విద్యుత్ దీపాలతో, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. గ్రామ ప్రజలు తెల్లవారుజామున మేళ తాళాలు భజన భజంత్రీలు డబ్బు లతో తిక్కాతాత స్వామి విగ్రహాన్ని తిక్కాతాత సమాధి వరకు గందోత్సవం ఊరేగించారు. సాయంత్రం ఉరుసు ను గ్రామ పెద్దలు, ప్రజలు స్వామి వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిక్కాతాత సమాధి వద్ద భక్తులతో కిక్కిరిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.