నాటుసారా స్థావరాల పైన దాడులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, కర్నూలు ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్ సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది మరియు DTF ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది అందరు కలిసి కర్నూలు టౌన్ బంగారుపేట నందు నాటుసారా స్థావరాల పైన దాడులు జరిపి, నాటు సారాయి తయారీకి సిద్దము గా ఉన్న 2400 లీటర్ల బెల్లపు ఊటను, 35 లీటర్ ల నాటు సారాయిని ద్వంశం చేయడ మైనది మరియు బంగారుపేటకు చెందిన గోనెల నాగదుర్గా వద్ధ 20 లీటర్ల నాటుసారాని స్వాదీనము చేసుకొని సదరు వ్యక్తి ని అదుపులోకి తెసుకొని కేసులు నమోదు చేసినట్టు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్ తెలిపారు. ఈ దాడులలో కర్నూల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్, Sub-Inspector K.నవీన్ బాబు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ S.కృష్ణ, డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ కర్నూల్ K.రాజేంద్ర ప్రసాద్ మరియు వారి వారి సిబ్బంది పాల్గొన్నారు అని తెలిపినారు.