PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో 8,99,895 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్

1 min read

కేంద్ర చట్టం,న్యాయ మంత్రిత్వ ,పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడి

లోక్ సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌తో సహా, ముఖ్యంగా ఏలూరు జిల్లాలో దేశవ్యాప్తంగా ఎన్ని సివిల్, క్రిమినల్ కేసుల పెండింగ్‌లో ఉన్నాయని,  ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల విభజన తర్వాత ఏర్పడిన జిల్లాల్లో కొత్త జిల్లా కోర్టులను ఏర్పాటు చేయడానికి ఏవైనా ప్రతిపాదనలు ఉన్నాయా అని, న్యాయస్థానాలలో ఖాళీల సంఖ్య, వాటి భర్తీకి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో శుక్రవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర చట్టం, న్యాయ మంత్రిత్వ , పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌  హైకోర్టు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 8,99,895 సివిల్,  క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అందించిన సమాచారం ప్రకారం అక్టోబర్ 31 వరకు ఏలూరు జిల్లాలో 65,848 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి బదులిచ్చారు.కోర్టుల్లో హాళ్లు, రెసిడెన్షియల్ యూనిట్లు, న్యాయవాదుల హాళ్లు, టాయిలెట్ కాంప్లెక్స్‌లు, డిజిటల్ కంప్యూటర్ రూమ్ వంటి ఐదు విభాగాలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని,   1993-94 నుంచి  ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.272.2395 కోట్లు విడుదలయ్యాయని, ప్రస్తుతం ఏపీలో  648 కోర్టు హాళ్లు, 600 రెసిడెన్షియల్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని , అదనంగా  84 కోర్టు హాళ్లు,  16 రెసిడెన్షియల్ యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు.న్యాయస్థానాల్లో మౌలిక వస్తువుల కల్పనకు కేంద్ర ప్రాయోజిత పథకం (CSS) ప్రారంభించినప్పటి నుండి 11571.57 కోట్లు విడుదల చేసినట్లు,  కోర్టు హాళ్ల సంఖ్య 30.06.2014 నాటికి 15,818 నుండి 31.10.2024 నాటికి 23,590కి పెరిగిందని,  2015 ఏప్రిల్‌లో జరిగిన ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రకారం ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను క్లియర్ చేయడానికి మొత్తం 25 హైకోర్టులు, జిల్లా కోర్టుల పరిధిలో కమిటీలను ఏర్పాటు చేశారని, పద్నాలుగో ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో క్రూరమైన నేరాల కేసులను పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్లు, మహిళలు, పిల్లలు మొదలైన  కేసులను 862 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు  విచారణ కోసం పనిచేస్తున్నాయని,  ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రిమినల్ కేసులను వేగంగా ఛేదించడానికి పది  ప్రత్యేక న్యాయస్థానాలు,  తొమ్మిది  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో  పనిచేస్తున్నాయని,  అత్యాచారం, పోక్సో చట్టం పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడం కోసం దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులకు (FTSC)  కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి సమాధానం ఇచ్చారు.30.09.2024 నాటికి 408 ప్రత్యేక POCSO (EPOCSO) కోర్టులతో సహా 750 FTSCలు దేశవ్యాప్తంగా 2,81,000 కంటే ఎక్కువ కేసులను పరిష్కరించినట్లు, కోర్టులలో పెండింగ్‌ కేసులు తగ్గించడానికి ప్రభుత్వం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ సవరణ చట్టం, 2018, వాణిజ్య న్యాయస్థానాల (సవరణ) చట్టం, 2018,  వంటి చట్టాలను సవరించిందని,  గత నాలుగు ఏళ్లలో జాతీయ లోక్ అదాలత్‌లో 21,73,26,129 కేసులు పరిష్కారం అయ్యాయని మంత్రి ఒక పర్యటనలో తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *