ఆంధ్ర హాస్పిటల్స్ లో పిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె చారిటి సౌజన్యంతో ఉచితంగా పిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేసారు. ఇప్పటి వరకు ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె చారిటి సౌజన్యంతో 4000 ఆపరేషన్లు పైన మరియు ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేశామని ఆంధ్ర హాస్పిటల్స్ చీఫ్ అఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ & డైరెక్టర్ డాక్టర్ పి.పి.రామారావు తెలిపారునగరంలోని ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆంధ్ర హాస్పిటల్స్ చీఫ్ అఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ & డైరెక్టర్ డాక్టర్ పి.పి.రామారావు మాట్లాడుతూ ఆస్ట్రేలియా లోని క్వీన్స్ ల్యాండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం తమ ఆసుపత్రికి వచ్చి, కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వర రావు, పిల్లల కార్డియాక్ సర్జన్ డాక్టర్ సాయి రామ్ తో కలిసి, ఆంధ్ర హాస్పిటల్స్ లో 16 పిల్లల గుండె ఆపరేషన్లు నిర్వహించారన్నారు. గత పది సంవత్సరాల నుండి ఇప్పటివరకు ముపైమూడు సార్లు ఆంధ్ర హాస్పిటల్స్ కు వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశారన్నారు. ప్రతి ఏటా యుకె నుంచి వైద్య బృందం వస్తారని, ఈ సారి ఆస్ట్రేలియా నుంచి వచ్చారని చెప్పారు. మున్ముందు కూడా ఈ రకమైన గుండె ఆపరేషనులు ప్రతి రెండు, మూడు నెలలకొకసారి ఆంధ్ర హాస్పిటల్స్ కు వచ్చి చేయనున్నారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 నుంచి 60 ఆపరేషన్లు చొప్పున సంవత్సరానికి 600 పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4000 ఆపరేషన్లు పైన మరియు ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేశామన్నారు.