రవీంద్ర ఇంజనీరింగ్ మహిళా కళాశాలలో ఆధ్యాత్మిక కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీ శ్రీ సంత్ సదానందగిరి స్వామీ మహారాజ్ చే ఈరోజు స్థానిక వెంకాయపల్లె లోని రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా వ్యవహరించిన శ్రీ శ్రీ సదానందగిరి స్వామీ మహారాజ్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు మరియు మెలుకువలు ఎలా సంపాదించుకోవాలి అన్న విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చదువులో నైపుణ్యం ఎలా సాధించలో తెలిపారు .ధ్యానం మరియు యోగా ద్వారా ఆత్మస్థైర్యం తో విద్యలో సాధికారికత సంపాదించవచ్చు అన్నారు. ఆరోగ్యంగా ఉంటే మనం దేనినైనా సాధించవచ్చు అన్నారు .ఆరోగ్యానికి అనేక మూల సూత్రాలు ఉన్నాయి అని తెలుపుతూ ప్రస్తుతము నా వయస్సు 109 సంవత్సరాలు.నేను ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను అంటే నా దైనందిన దినచర్య, ఆహార నియమాలు ,యోగ, ధ్యాన సాధనలు నాకు ఉపయుక్తంగా ఉన్నాయని తెలియజేశారు. విద్యలో నైపుణ్యం మరియు ప్రతిభ చాటాలంటే అది స్వయంగా మన చేతుల్లోనే ఉందని తెలుపుతూ పట్టుదల, నిరంతర కృషి ప్రధానంగా కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆధ్యాత్మికవేత్త’పిరమిడ్ బ్రహ్మరిషి డాక్టర్ శ్రీ బి.వి. రెడ్డి (పిరమిడ్ ప్రెసిడెంట్) వారు విచ్చేశారు. ఈ కార్యక్రమం రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు శ్రీ పుల్లయ్య అధ్యక్షతన నిర్వహింపబడింది.